సాక్షి డిజిటల్ న్యూస్ తేదీ 29 జనవరి 2025 యాదాద్రి జిల్లా గుండాల మండలం రిపోర్టర్ ఎండి ఉస్మాన్
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారాంపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్‌స్టేషన్ పనులకు బుధవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి విద్యుత్ మౌలిక సదుపాయాలు అత్యంత కీలకమని తెలిపారు. సబ్‌స్టేషన్ ఏర్పాటు ద్వారా రైతులకు, గ్రామ ప్రజలకు నాణ్యమైన మరియు నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందని పేర్కొన్నారు.ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని 33/11 కేవీ సామర్థ్యంతో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. వెల్మజాల నుంచి సీతారాంపురం వరకు నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులు కూడా అతి త్వరలో ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.ఈ రహదారి నిర్మాణంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభమవడంతో పాటు అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సీతారాంపురం గ్రామ సర్పంచ్ కాళీ పద్మా వెంకన్న,మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వర్లు,జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి, గుండాల మండలం మాజీ అధ్యక్షులు ధ్యాప కృష్ణారెడ్డి,గోల్కొండ యాదగిరి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామ్ రెడ్డి పాల్గొన్నారు.విద్యుత్తు శాఖ అధికారులు డీఈ వెంకటేశ్వర్లు, ఏడీ బాలు నాయక్,గుండాల మండలం ఏఈ అంబాల నరసింహ, కన్స్ట్రక్షన్ టెక్నికల్ డీఈ సుధీర్ కుమార్,కన్స్ట్రక్షన్ ఏడీ రవీందర్,కన్స్ట్రక్షన్ ఏఈ అనిల్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.