సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 29 2026, అనంతగిరి మండల రిపోర్టర్ గరిడేపల్లి రమేష్ అనంతగిరి మండల పరిధిలోని పాలవరం గ్రామంలో మంగళవారం సర్పంచ్ మట్టపల్లి నరేష్ ఆధ్వర్యంలో వీధుల వారీగా దోమల మందు పిచికారి చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలో ముమ్మర పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని, పరిసరాలను మాతో పాటు, గ్రామ ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుద్ధ్యం వైపు అడుగులు వేస్తున్నామని, రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉండాలి అంటే ప్రజల యొక్క భాగస్వామ్యం ముఖ్యమని, ప్రజలందరూ సహకరించి పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. వర్షాకాలం రీత్యా పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది కాబట్టి, పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా దోమల బారి నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే మన ఇంటి చుట్టూ పరిసరాలను, పరిశుభ్రంగా చూసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బెల్లంకొండ అంజయ్య,వార్డు మెంబెర్స్ మట్టపల్లి లావణ్య,రామకృష్ణ, ఉపేందర్,అంజమ్మ,గ్రామ శాఖ అధ్యక్షుడు మట్టపల్లి రామకోటయ్య, సోషల్ మీడియా మట్టపల్లి నరేష్, శ్రీనివాస్ గౌడ్, ఉపేందర్, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు, యువకులు,పెద్దలు తదితరులు పాల్గొన్నారు.