సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 29, గూడూరు రిపోర్టర్ (చెన్నూరు మస్తాన్) తోటి కళాకారుడు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య సహాయం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న కళాకారుడికి కళాకారుల బృందం ఆర్థిక సాయం అందించారు. చిల్లకూరు మండలం పల్లమాల గ్రామానికి చెందిన పండరి భజన కళాకారుడు చెందులూరు రమణయ్యకి అనారోగ్యంతో బాధ పడుతున్న నేపథ్యంలో కళాకారుల అందరూ రూ.41,200 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాకారులు ఐక్యమత్యంతో సాటి కళాకారుని ఆదుకోవడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఇదే విధంగా కళాకారులు కలిసి, మెలసి సేవా కార్యక్రమాలు విరివిగా చేస్తామని తెలిపారు. ప్రభుత్వం కళాకారులని గుర్తించి కళారంగాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాకారులు టీవీ కృష్ణ దాసు, చీర్ల శ్రీనయ్య, నోసిన రంగయ్య, జి ప్రభాకర్, పి.శ్రీకాంత్, కె.విజయ్ కుమార్, కళ్యాణ్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.