తృటిలో తప్పిన పెను ప్రమాదం

*పంటకాలువ ప్రక్కన విధ్యుత్ స్థంబాన్ని ఢీ కొట్టిన పాఠశాల బస్సు

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు
సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం వద్ద విద్యార్థులతో ప్రయాణిస్తున్న భాష్యం పాఠశాల బస్సుకి పెనుప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం సఖినేటిపల్లి నుండి మల్కిపురం భాష్యం పాఠశాలకు వెళ్తున్న పాఠశాలకు చెందిన బస్సు అదుపుతప్పి పంట కాలువ ప్రక్కనున్న 11కేవీ విధ్యుత్ స్తంబానికి ఢీ కొట్టి పంటకాలువలో పడకుండా ఆగడంతో అందులో ప్రయానిస్తున్న విద్యార్థులు స్వల్ప గాయాలతో భయట పడ్డారు. అంతర్వేది కల్యాణమహోత్సవాలు కావడంతో ట్రాఫిక్ రద్దీగా ఉన్న రహదారిపై ఎదుదురుగా ఆ సమయంలో వాహనం లేకపోవడం పెద్ద ఆక్సిడెంట్ తప్పినట్లే. అదేవిదంగా విధ్యుత్ స్తంభం ఢీ కొట్టడం స్థంభం విరిగి బస్సుపై పడి పెను ప్రమాదం తప్పడం ఒకఎత్తయితే, పి. గన్నవరం ప్రధాన పంటకాలువ పూర్తి నీటిమట్టంతో ప్రవహిస్తుంది, ఈ స్థితిలో బస్సు పంటకాలువలో దూసుకుపోయినట్లయితే కాలువ ప్రవాహానికి బస్సు మునిగి పెద్ద ప్రమాదమే జరిగిఉండేదని, ఆసమయంలో ప్రయాణిస్తున్న 23 మంది విద్యార్థులు మృత్యుంజయిలే అని సంఘటన ప్రత్యక్షంగా చూసిన స్థానికులు పేర్కొన్నారు. స్టీరింగ్ స్ట్రక్ అవడం మరియు బ్రేక్ ఫెయిల్ కావడం కారణంగా ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ తెలిపారు. జిల్లా రవాణా అధికారి టి. శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని బస్సు రికార్డులు పరిశీలించి, విచారణ చేశారు. పాఠశాల యాజమాన్యం ఫిట్ నెస్ లేని బస్సులను నడుపుతూ, పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తున్న పాఠశాల యాజమాన్యం పై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *