టీఆర్పీ పార్టీలోకి జర్నలిస్ట్ తొగరి కరుణాకర్…

★రాష్ట్ర నాయకులు రజిని కుమార్ యాదవ్

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి.29: వేములవాడ. ఆర్. సి. ఇంచార్జ్: సయ్యద్ షబ్బీర్… బిసిల హక్కుల సాధనకై ఏర్పడ్డ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎలక్షన్ గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి వేములవాడకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ తొగరి కరుణాకర్ ను ఆ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి రజిని కుమార్ యాదవ్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుర్ర మల్లేశం గౌడ్ పార్టీలోకి సాధారంగా కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా రజినికుమార్ యాదవ్ మాట్లాడుతూ బిసిల హక్కుల కోసం ఏర్పడ్డ ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని తెలిపారు. సిరిసిల్ల 39 వార్డుల్లో, వేములవాడ 28 వార్డుల్లో పార్టీ తరుపున అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మున్సిపల్ ఎలక్షన్ లలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరుపున పోటీ చేయాలనీ అనుకున్నవారు జిల్లా పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. అలాగే వేములవాడ పట్టణంలోని అన్ని వార్డులలో అభ్యర్థులు పోటీ చేసేవారికి పార్టీ బి ఫార్మ్ ఇస్తామని, వేములవాడ పట్టణంలో కరుణాకర్ ను సంప్రదించాలని పేర్కొన్నారు. వేములవాడ పట్టణం తరుపున నియామకం అయిన తొగరి కరుణాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరుపున వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వాలని, ఎవరైనా పార్టీ తరుపున పోటీ చేయాలనీ అనుకుంటే జిల్లా పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అఖిల్ పాషా, సిరిసిల్ల నాయకులు మల్లేష్, వేములవాడ నాయకులు కోరేపు అనిల్, లాల శేఖర్, దుర్గ ప్రసాద్, శేఖర్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.