జగిత్యాల సబ్ ట్రెజరి ఆఫీసర్ యస్.టి. వో సత్యనారాయణ యాదవ్, కుమార స్వామి యాదవ్ లకు ఘన సన్మానం భగవద్గీత ల ప్రదానం

సాక్షి డిజిటల్ న్యూస్ 29 జనవరి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి, బిసి ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లు అమలు చేయాలి జగిత్యాల సబ్ ట్రెజరీ ఆఫీసర్ మానుక సత్యనారాయణ యాదవ్ ను, వెటర్నరీ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న వెల్పుగొండ కుమార స్వామి యాదవ్ లను తెలంగాణ యాదవ మహాసభ ఉద్యోగుల సంఘ పక్షాన రాష్ట్ర శాఖ అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, అప్పాల గంగయ్య యాదవ్, బీనవేని గంగన్న యాదవ్ లు ఘనంగా శాలువాలతో సత్కరించి భగవద్గీతలను ప్రదానం చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వారు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. బిసి ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లు అమలు చేయాలని, 24 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు గెజిటెడ్ హోదా కల్పించాలని కోరారు.