ఘనంగా తాసిల్దార్ జయ జయ రావు ను సన్మానించిన ఆర్.వి ఫౌండేషన్

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 29 కోట మండల రిపోర్టర్ వెంకట కృష్ణయ్య: కోట మండల తాసిల్దార్ జయ జయ రావును ఆర్.వి ఫౌండేషన్ చైర్మన్ ఏంబేటి వెంకటకృష్ణయ్య బుధవారం ఘనంగా సన్మానించారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ సేవా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ వి ఫౌండేషన్ అధ్యక్షుడు ఎంబేటీ వెంకట కృష్ణయ్య మాట్లాడుతూ కోట తాసిల్దార్ సేవలను గుర్తించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా ప్రశంస పత్రాన్ని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల చేతుల మీదుగా అందుకోవడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా ఆర్ వి ఫౌండేషన్ తరపున బుధవారం తాసిల్దార్ ను ఘనంగా సత్కరించడం జరిగింది అన్నారు. గత సంవత్సరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులు మీదుగా రాష్ట్రస్థాయి పురస్కారాన్ని కూడా అందుకోవడం, విధి నిర్వహణలో ఆయన సేవా దృక్పథానికి నిదర్శనం అన్నారు. మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మండలంలోని భూ సమస్యల పరిష్కరించడంలో తనదైన శైలిలో సేవలందిస్తున్న తాసిల్దార్ జయ జయ రావు మండల ప్రజల అభిమానాన్ని చురకొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ వి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.