సాక్షి డిజిటల్ న్యూస్ 29 జనవరి మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు) గార్ల మండలంలోని పెద్ద కిష్టాపురం సర్పంచ్ గంగావత్ రాంసింగ్ నాయక్ బుధవారం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని తన పరిధిలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు, ఈ సందర్భంగా సర్పంచ్ గంగావత్ రాంసింగ్ నాయక్ మాట్లాడుతూ గ్రామస్తులందరూ వారి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నీరు వృధాగా పోకుండా చూసుకోవాలని గ్రామంలో శానిటేషన్ పనులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు ఇంటి పన్నులు చెల్లించాలని గ్రామాభివృద్ధికి ఆటంకం కలిగించే వ్యక్తులకు చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి భూక్య వెంకటేష్ ఉపసర్పంచ్ బానోత్ శివ వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…
