సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29, ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్, ధర్పల్లి మండలం గోవిందపల్లి గుడి తాండకు చెందిన హరిచంద్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ శ్రీ ఎం. హరీచంద్ జాదవ్ కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్ గా నియమితులు కావడం గౌరవప్రదమైన విషయం. హైకోర్టు పరిధిలో కేంద్ర ప్రభుత్వ తరపున వివిధ కేసులు, పిటిషన్లు నిర్వహిస్తూ న్యాయ పరిరక్షణను సమర్థంగా అందించే బాధ్యతను ఆయన నిర్వహించనున్నారు. న్యాయ రంగంలో అనుభవం, నిష్ట, న్యాయ నైపుణ్యం, సమర్థ వాదన శైలి ఉన్న ఆయన ఈ బాధ్యతను ఘనంగా నిర్వర్తించి ప్రభుత్వ ప్రయోజనాలను న్యాయవిధానానికి అనుగుణంగా రక్షిస్తారని విశ్వసించవచ్చు. ఈ ఘన నియామకానికి ఆయనకు మా హృదయపూర్వక అభినందనలు.