కమనీయం శ్రీ సిద్దేశ్వర స్వామి

★మహా రథోత్సవం..! ★కోరిన వారికి కొంగు బంగారం

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద జనవరి 29, మండల కేంద్రంలోని ప్రజలకు భక్తులకు ఎంతో భక్తిశ్రద్దలతో కోరిన వారికి కొంగు బంగారంగా నిలిచిన శ్రీ సిద్ధేశ్వర స్వామి రధోత్సవ ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన శ్రీ సిద్దేశ్వర స్వామి రధోత్సవ కార్యక్రమం ఆలయ వంశపా రంపర్య ధర్మకర్త రాజా పంపన్న గౌడ్ , శివన్న గౌడు, సిద్ధార్థ గౌడు, హరీష్ గౌడ్ మరియు భక్తుల నడుమ బుధవారం వైభవంగా కమనీయం రమనీయంగా జరిగింది. ముందుగా ఆలయంలో వెలసిన శ్రీ సిద్ధేశ్వర స్వయంభు విగ్రహానికి ఆలయ పూజారి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహించి, సాయంత్రం శ్రీ సిద్ధేశ్వర స్వామి విగ్రహ మూర్తిని పల్లకిలో ఉంచి ఎదురు బసవన్న గుడి వద్ద పూజ చేసి తిరిగి రథోత్స వం కోసం వీక్షించేందుకు వచ్చిన భక్తులకు తెలిసేలా పెద్ద అవుటు బాణాసంచాను కాల్చి రధోత్సవంపై స్వయంభు విగ్రహాన్ని ప్రతిష్టించి శ్రీ సిద్ధేశ్వర హర హర శంభో శంకర అంటూ రథాన్ని భక్తులు చిన్నారులు యువకులు ఎంతో భక్తి శ్రద్ధలతో లాగి ఉత్సవాన్ని అరంభించారు. రథోత్సవం ఎదురు బసవన్న గుడి వరకు వెళ్లి తిరిగి యధా స్థానానికి చేర్చి చప్పట్లతో రథ సంస్కారాన్ని విరమించారు రథోత్సవ కార్యక్రమాన్ని వీక్షించటం కోసం ప్రముఖులంతా వచ్చి స్వామివారి దర్శించుకుని తమ మొక్కబొడులను చెల్లించుకున్నారు రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆకర్షణగా నిలిచారు. రధోత్సవ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పత్తికొండ డి.ఎస్.పి వెంకట్రామయ్య ఆధ్వర్యంలో ఆలూరు సిఐ రవిశంకర్ రెడ్డి హోళగుంద ఎస్సై దిలీప్ కుమార్ గురజాల తోపాటు చిప్పిగిరి ఆస్పరి హలహర్వి ఆలూరు ఎస్సై తోపాటు 40 మంది సిబ్బంది పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు దుమ్ము దూళి లైట్లు సమస్యలు తలెత్తకుండా మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చలవాది రంగమ్మ తనయుడు పంపావతి మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ నీళ్ల ట్యాంకర్లతో రోడ్డుపై చెల్లించి దుమ్ము ధూళి లేకుండా పారిశుద్ధ పనులు చేపట్టారు ఈ కార్యక్రమంలో భక్తులు, చిన్నారులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.