సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29/2026, మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్ ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడలో నివసించే కంచర్ల సోమిరెడ్డి కుమార్తె కంచర్ల ప్రతీక సీనియర్స్ ఉమెన్స్ వన్డే ట్రోఫీ రంజీ ట్రోఫీ కి ఎంపిక కావడం, హైదరాబాద్ లో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో ప్రతీక సెంచరీ (100 ) స్కోర్ చేయడం చాలా అభినందనీయమని,అభినందిస్తూ శాలువాతో సత్కరించి మును మందు టీం ఇండియా కి సెలెక్ట్ అయి ఇండియా తరపున ఆడి ఉప్పల్ నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఉప్పల్ ప్రజలు మరియు నాయకులు ఆకాంక్షిస్తున్నారు.అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు ప్రతీక తండ్రి అయిన కంచర్ల సోమిరెడ్డి ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ వారి కష్టానికి ఫలితం లభించిందని వారిని అభినందిస్తూ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎద్దుల కొండల్ రెడ్డి, కోకండ జగన్ శ్యామ్,బాలు మొదలగువారు పాల్గొన్నారు