ఎపి గ్రామపంచాయితీ ఎంప్లాయీస్ & వర్కర్స్ యూనియన్

★పంచాయతీ ఈఓకి సమ్మె నోటీసు ఇస్తున్న పంచాయతీ కార్మికులు సీఐటీయూ నాయకులు

సాక్షి డిజిటల్ న్యూస్, రిపోర్టర్ బొక్క నాగేశ్వరరావు, జనవరి 29 2026 ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె గోపాల్ మాట్లాడుతూకార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు పర్మినెంట్ చేయాలని, మున్సిపల్ కార్మికులతో సమానంగా కనీస వేతనం రూ.21 వేలు చెల్లించాలని, 132,142,680 జీఓలు, టెండర్లపై హైకోర్టు తీర్పు అమలు తదితర డిమాండ్ల పరిష్కారానికి ఫిబ్రవరి 9న సమ్మెలో మన పంచాయితీలోని కార్మికులు కూడా పాల్గొంటు న్నారని తెలియజేస్తూ. మన దేశంలో స్వాతంత్ర్యం రాక పూర్వమే బ్రిటీష్ కాలం నుండి పోరాడి త్యాగాలతో సాధించుకున్న ట్రేడ్ యూనియన్ చట్టం- 1931, వర్క్ మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ -1928 నేతనాల చెల్లింపు చట్టం-1935, కనీస వేతనాల చట్టం - 1948, బోనస్, గ్రాట్యూటీ, సిఎఫ్, ఇఎస్ఆ వంటి 29 చట్టాలను కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసి 4 లేబర్కోర్స్ మార్చివేసింది. 2025 నవంబర్ 21 నుండి అమలు చేయాలని నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ లేబర్కోడ్స్ కార్మికుల హక్కులను పూర్తిగా హరిసాయి. సంఘం పెట్టుకునే హక్కును, సమ్మె హక్కును, వేతనాల కోసం దేవసారాలాడీ హక్కులను నిర్వీర్థ్యణ చేస్తాయి. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ విధానం ద్వారా ఉద్యోగ భద్రత లేకుండా యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై ఆధార పడాల్సిన పరిస్థితిలోకి నెట్టబడతారు. ఇంతటి ప్రమాదకరమైన లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర దార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు ఫిబ్రవరి 12న దేశవ్యాపిత సమ్మెకు పిలుపు నిచ్చాయి. మన రాష్ట్రంలో పంచాయితీ కార్మికులకు గత 9 సం॥లుగా జీతాలు పెరగలేదు. మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తున్న విధులనే పంచాయితీ కార్మికులు కూడా నిర్వహిస్తున్నారు. మున్సిపల్ కార్మికులకు ప్రస్తుతం రూ.21 వేలు జీతం చెల్లిస్తున్నారు. కానీ పంచాయితీ కార్మికులకు రాష్ట్ర మంతటా ఒకే జీతం లేదు. 4 వేల నుండి 14 వేలు లోపు జీతాలు చెల్లిస్తున్నారు. అవి కూడా జిల్లాలోని అనేక పంచాయితీల్లో నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయి. దీనితో కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసవేతనాలు, గుర్తింపు కార్డులు, పిఎఫ్, ఇఎస్ఐ, దహన సంస్కారాలకు ఆర్థికసహాయం మొదలగు వాటికి సంబంధించి 6 ఏళ్ళ క్రితం జార్చేసిన 332, 142, 680 జిఓలు నేటికి అమలుకావడం లేదు. గతం నుండి పనిచేస్తున్న వారిని టెండర్లతో సంబంధం లేకుండా విధుల్లో కొనసాగించాలని 2015 మరియు 2023లో హైకోర్టు ఇచ్చిన తీర్పును బుట్టదాఖలు చేస్తున్నారు. ఆక్రమ తొలగింపులు, వేధింపులు కొనసాగుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 12వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో మన పంచాయితీలోని కార్మికులందరూ పాల్గొంటారని తెలియజేస్తున్నాము. కార్మిక వ్యతిరేక 4 లేజర్ కోడ్స్ రద్దు చెయ్యాలి. ప్రస్తుత చట్టాలను పటిష్టంగా ఆసులు వేయాలి.గత 8 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా జీఓ.. నెం: 30/01-03-2024 ప్రకారం పంచాయితీ కార్మికులకు కూడా కనీసవేతనం రూ. 21 వేలుగా నిర్ణయించి అమలు వేయాలి.1999లో జారీచేసిన జీఓ నెం. 551 ప్రకారం కార్మికులందరికీ గుర్తింపు కార్డులు, కనీస వేతనాలు, ఈసిఎఫ్, ఈఎస్బీ అనులు చేయాలి.ప్రతినెలా 5వ తేదీ లోపు జీతాలు చెల్లించాలి, బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి. 42 132, 142, 680లను ఏ విధమైన మినహాయింపులు లేకుండా ఆసులు చేయాలి. టెండర్లకు సంబంధించి హైకోర్టు తీర్పును అన్ని స్థాయిల్లో అమలు చేయించాలి.పార్ట్ టైము ప్రభుత్వమే మినిమమ్ టైమ్ స్కేల్ వేతనాలు చెల్లించాలి, కార్మికులందరికీ యూనిఫామ్, చెప్పులు, సబ్బులు, నూనెలు, స్టిచ్చింగ్ ఛార్జీలు, టవల్స్ ఇవ్వాలి. పనిముట్లు, కిట్లు సకాలంలో అందించాలి. ఈ కార్యక్రమంలో సిఐటి కనించర్ల మండల కార్యదర్శి బెజ్జం భూషణం దేవి అన్నమయ్య, విజయరాణి , సుధాకర్, సాంబశివరావు, గణపతి, నాగార్జున, ch, రవి నాయకులు తదితరులు పాల్గొన్నారు.