సాక్షి డిజిటల్ న్యూస్: జనవరి 29, పెద్దకడబురు, మంత్రాలయం తాలూకా కర్నూల్ జిల్లా, రిపోర్టర్ గుడిసె శివరాజ్ : పెద్దకడబూరుకు చెందిన సాలె ధనుంజయ గ్రూప్-2 ఫలితాల్లో ప్రతిభ చాటి జోన్-4 ఎక్సైజ్ ఎస్ఐగా ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఈయన తల్లిదండ్రులు తహశీల్దార్ కార్యాలయం వద్ద చిన్న కిరాణా కొట్టు నడుపుతూ కుమారుడిని బీటెక్ వరకు చదివించారు. అమ్మానాన్నల కష్టాన్ని గుర్తించిన ధనుంజయ పట్టుదలతో చదివి ఈ విజయం సాధించారు. సామాన్య కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన ఆయనను పద్మశాలి కుటుంబ సభ్యులందరూ అభినందించారు.