సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29 మంచిర్యాల జిల్లా ప్రతినిధి రావుల రాంమోహన్.. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక & పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకి శాలువలతో సత్కరించి స్వాగతం పలికిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఫిబ్రవరి 11వ తేదీన జరగబోయే మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎలక్షన్ల గురించి చర్చించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు లు మాట్లాడుతూ మంచిర్యాల కార్పొరేషన్ లోని 60 డివిజన్ స్థానాల్లో మరియు లక్షెట్టీపేట్ మున్సిపాలిటీలోని 15 కౌన్సిలర్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
