సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి29, జి.మాడుగుల: చింతపల్లి రోడ్డు మార్గంలో ఉరుము నుండి కొక్కిరాపల్లి ఘాటి వరకు జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించడం సంతోషకరమని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సురబంగి రామకృష్ణ తెలిపారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో ఉరుము గ్రామ జంక్షన్ నుండి బుధవారం చేపట్టిన రోడ్డు కిరువైపులా జంగిల్ క్లియరెన్స్ పనులను ఆయన పరిశీలించారు. గత నెలలో ఈ రోడ్డు మార్గం ప్రమాదకరమైన మలుపులతో పిచ్చి తుప్పలతో నిండి ఎదురెదురుగా వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు, వాహన ప్రమాదాలు కూడా జరుగుతున్నాయన, కొత్తపళ్లి జలపాతానికి వచ్చే పర్యాటకులు వాహనదారులు, ఇబ్బందులు సమస్యలను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు పాడేరులో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమంలో వినతులు అందజేసినట్టు ఆయన తెలిపారు. ఈ రోడ్డుకు ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని వినతి మేరకు జిల్లా కలెక్టర్ పాడేరు ఆర్ అండ్ బి శాఖ ఇంజనీరింగ్ అధికారులు చొరవ జెసిబి తో పనులు ప్రారంభించడం వల్ల వాహందారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ రోడ్డు మార్గంలో పిచ్చి తుప్పలు నిండి ఉండడం వలన వాహనదారులు ఇబ్బందులు సమస్యలు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని పాడేరు లో జరిగిన గ్రీవెన్స్ లో ఇచ్చిన వినతల మేరకు జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టడం సంతోషకరమని రామకృష్ణ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆర్ అండ్ బి శాఖ అధికారులకు పాలమామిడి సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రామకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు.