ఉమ్మడి జిల్లాలోని పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ “వి.హర్షవర్ధన్ రాజు” ఐపీఎస్

★దొంగతనాల కట్టడితో పాటు చోరీ సొత్తు రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలి. ★డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి చట్ట తిరేక,అసాంఘీక కార్యక్రమాల అడ్డుకట్ట వెయ్యాలి. ★పెండింగ్ NBWs ను ప్రత్యేక టీంతో త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలి. ★విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారాలను మరియు సిబ్బంది అభినందించిన జిల్లా ఎస్పీ. ★విధి నిర్వహణ లో అలసత్వం వహిస్తే సహించేదిలేదు.

సాక్షి డిజిటల్ న్యూస్ : జనవరి 29 (ప్రకాశం & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్ : షేక్ మక్బూల్ బాష).
ఉమ్మడి ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాలోని కనిగిరి సబ్ డివిజన్ తో పాటు ఒంగోలు, దర్శి డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో బుధవారం ఎస్పీ జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్షా సమావేశమును నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ ముఖ్యంగా గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, హత్య కేసులు, పెండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్స్, రోడ్డు ప్రమాదాలు, దేవాలయాల వద్ద భద్రత ఎర్పాట్లు, అయా సబ్ డివిజన్ లోని సిసికెమెరాల పనితీరు, ఎన్ఫోర్స్మెంట్ మరియు ఇతర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరితగతిన పరిష్కరించాలని, ప్రాపర్టీ నేరాల కట్టడి, నిందితులు గుర్తింపు, రికవరీకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దొంగ సొత్తు రికవరీ చేయాలని, అనుమానితుల వ్యక్తులను ఫింగర్ ప్రింట్ మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ ద్వారా ఫింగర్ ప్రింట్ సేకరించి తనిఖీ చేయాలన్నారు. మహిళలపై జరిగే నేరాలు, పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి భాదితులకు న్యాయం చేకుర్చాలి. పోలీస్ స్టేషన్ల పరిధిలో చట్ట వ్యతిరేక మరియు అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా (డ్రోన్ కెమెరాలతో) పెట్టి కట్టడి చేయాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, బ్లాక్ స్పాట్స్ పై దృష్టి సారించాలన్నారు. జాతీయ రహదారుల్లోకి సర్వీస్ రోడ్లు కలుస్తున్న చోట ప్రమాదాల నివారణకు మిర్రర్లు, రిఫ్లెక్టర్లు, స్పీడ్ బ్రేకర్లు వంటివి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా రహదారులపైన వాహనాలను నిలపకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేసులను అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి పూర్తిస్థాయిలో సాక్ష్యాధారాలు సేకరించాలని, ఆర్ఎఫ్ఎస్ఎల్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులను త్వరితగతిన తెప్పించుకుని పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే NBW వారెంట్స్ పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.పోలీస్ అధికారులు అందరూ తమ తమ పరిధిలో ఉన్న గ్రామాలను సందర్శించి అక్కడ ఎటువంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. తరచూ నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అలాంటి ప్రాంతాలలో పోలీసు అధికారులు విజిబుల్ పోలీసింగ్ ను పెంచి ముందస్తుగానే నేరాలను నియంత్రించాలి. PGRS ద్వారా వచ్చిన ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యతతో పరిష్కరించాలన్నారు. సైబర్ నేరాల పై ప్రజలలో మరింత అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి స్కూల్ మరియు కాలేజీ విధ్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పై ప్రత్యేకదృష్టి కేంద్రకరించి, గంజాయి, డ్రగ్స్, గ్యాంబ్లింగ్, మట్కా శిబిరాల దాడులు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజు వాహనాల తనిఖీలు, బీట్స్ , పెట్రోలింగ్ , చేపట్టాలని , బోర్డర్ చెక్ పోస్ట్ లలో నిత్యం నిఘా ఉంచి అక్రమరవాణా పై అడ్డుకట్ట వేయాలన్నారు. గ్రామాలను , వార్డులను సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొని ఎటువంటి తగాదాలు, మత ఘర్షణలు తదితర నేరాలపై పెప్పటికప్పుడు సమాచారం సేకరించి పై అధికారులకు తెలపాలి. గ్రామాలలో పల్లెనిద్ర చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి వేళల్లో గస్తీ విధుల్లో అప్రమత్తంగా తిరుగుతూ పాత నేరస్థులను తనిఖీ చేసి నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో శక్తి యాప్ పై అవగాహన మరియు శక్తి కాల్స్ పై వెంటనే స్పందించాలని అధికారులకు సూచించారు. కెమెరాలు, డ్రోన్ ల యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేసి ఏర్పాటు చేసే విధంగా చూడాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పాటిస్తూ పొలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలిగి వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉండాలని, మహిళలు, చిన్నారుల సంబంధిత ఫిర్యాదులపై తక్షణమే స్పదించాలని, పోలీస్ శాఖపై నమ్మకం పెంపొందించేలా సేవలు అందించాలని సూచించారు.బహిరంగ ప్రదేశాలలో గుర్తించి ప్రజల సహకారంతో వాటిని శుభ్రం చేయాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ఒంగోలు డి.ఎస్.పి ఆర్ శ్రీనివాసరావు, దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, డిసిఆర్బి సిఐ దేవ ప్రభాకర్, సబ్ డివిజన్ సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు.