
సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29 మంచిర్యాల జిల్లా ప్రతినిధి రావుల రాంమోహన్…. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1వ తేదిన ఆదివారం రోజున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాల బాలికల ఎంపిక పోటీలను మంచిర్యాల పట్టణంలోని జెడ్.పి.హెచ్.ఎస్ బాలుర ఉన్నత పాఠశాల గ్రౌండ్స్ లో ఉదయం 9 గంటల నుండి నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లిలో ఫిబ్రవరి 5వ తేదీ నుండి 8వ తేది వరకు జరగబోయే తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల వాలీబాల్ ఛాంపియన్షిప్ లో పాల్గొంటారు. ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు 01.01. 2010 రోజున మరియు తర్వాత జన్మించిన వారు ఎంపిక పోటీలకు అర్హులుగా పేర్కొన్నారు. అర్హులైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కి సంబంధించిన నాలుగు జిల్లాల( ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్) చెందిన క్రీడాకారులు పాల్గొనగలరు. వయసు ధ్రువీకరణ పత్రము,ఆధార్ కార్డు 6 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరి తీసుకురావాల్సింది గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ నల్ల శంకర్,ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, కోశాధికారి గాజుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బోరి యాదగిరి,బైరగోని సిద్దయ్య గౌడ్, సంయుక్త కార్యదర్శి రావుల రామ్మోహన్ ఒక ప్రకటన లో తెలిపారు. ఏదైనా సమాచారం కొరకు 9676590211, 9951246104 సంప్రదింవలెను.