సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 భూమయ్య పిట్లం పిట్లం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిట్లంలో జెడ్ పి హెచ్ ఎస్ పిట్లం కాంప్లెక్స్, జెడ్ పి హెచ్ ఎస్ చిన్న కొడప్గల్ కాంప్లెక్స్ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రాథమిక స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మండల విద్యాధికారి దేవి సింగ్ మాట్లాడుతూ విద్యార్థులకు కనీస పట్టణ నైపుణ్యాలను నేర్పించాలని వారికి త్వరలో జరగబోయే పరీక్షలకు సన్నద్ధం చేయాలని సూచించడం జరిగింది. అనంతరం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు అనురాధ మాట్లాడుతూ రెండవ ,తరగతి మూడవ తరగతి విద్యార్థులకు త్వరలో జరిగే ఎఫ్ ఎల్ ఎఫ్ పరీక్షకు సన్నద్ధం చేయాలని సూచించడం జరిగింది. తరువాత ఆర్పీలు శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ సెషన్ల వారీగా వివరించడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు సి ఆర్ పి లు హైమద్ పాషా, విటవ్వ పాల్గొన్నారు.