ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోంది: మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ధ్వజం

సాక్షి డిజిటల్ న్యూస్, 29/జనవరి/2026, ​షాద్‌నగర్: రిపోర్టర్/కృష్ణ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజి ఎన్ఆర్ఇజిఏ) ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తోందని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఆయన మండిపడ్డారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాల్సింది పోయి, తిరిగి రాజుల కాలం నాటి పరిస్థితులకు తీసుకెళ్లే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఆరోపించారు. పేద వాడికి కడుపు నిండా తిండి పెట్టే ఉపాధి హామీ పథకంలో కోతలు విధిస్తూ, కార్మికుల హక్కులను హరించేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. పంచాయతీలు, రాష్ట్రాలకు ఉండాల్సిన అధికారాలను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ​ వివాదా స్పదంగా మారిన పలు చట్టాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
​పేదలకు అండగా ఉండాల్సిన పథకాలను నిర్వీర్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, ప్రజల పక్షాన పోరాటాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు….