సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 29, (శేరీలింగంపల్లి): నల్లగండ్ల డివిజన్ కాంగ్రెస్ నాయకుడు పల్లపు సురేందర్ ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపారు. ఆటో యూనియన్ సభ్యులతో సమావేశమై వారి జీవన పరిస్థితులు, ఉపాధి భద్రత, సంక్షేమ పథకాల అమలులో ఎదురవుతున్న అవరోధాలను అడిగి తెలుసుకున్న ఆయన, ఈ అంశాలను ఎంబీసీ చైర్మన్ జరుపటి జైపాల్ దృష్టికి తీసుకెళ్లారు. కార్మికుల ఇబ్బందులను ఉన్నతాధికారుల ద్వారా పరిష్కరిస్తామని జైపాల్ నుంచి హామీ పొందారు. కార్మికుల హక్కుల కోసం ప్రజాపక్షాన నిలబడి పోరాడతానని, ఆటో యూనియన్ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని సురేందర్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆటో యూనియన్ నాయకులు తమ సమస్యలను సురేందర్ దృష్టికి తీసుకురాగా, ఆయన సానుకూలంగా స్పందిస్తూ వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు.