
సాక్షి డిజిటల్ న్యూస్: 29 జనవరి 2026, సత్తెనపల్లి మండల రిపోర్టర్: సిహెచ్ విజయ్ గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాష గుంటూరు నగరంలోని కె ఎస్ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల మరియు అదే ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక పాఠశాల, హిందూ కాలేజ్ హై స్కూల్ , యాదవ ఉన్నత పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నల్లపాడు లను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలు, పదో తరగతి విద్యార్థులకు జరుగుతున్న 100 రోజుల ప్రణాళిక అమలు తీరును, 9వ తరగతి విద్యార్థుల సిలబస్ పరిశీలించారు ఆయా పాఠశాలల లో వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థుల నమోదు పెంచేందుకు ఇప్పటినుండే గ్రామస్తులు మరియు తల్లిదండ్రుల సహకారంతో తమ క్యాచ్ మెంట్ ఏరియాలో ఉన్న విద్యార్థులందరినీ తమ పాఠశాలలో చేరే విధంగా ప్రణాళిక ఏర్పరుచుకోవాలని , ప్రవేట్ పాఠశాలల కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండే విధంగా ప్రధానో పాధ్యాయులు మరియు ఉపాధ్యాయులను కృషి చేయాలని అన్నారుఈ సందర్భంగా హిందూ కాలేజీ హైస్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి భోజనమును పరిశీలించారు ఈ సందర్భంగా వారు కోడిగుడ్లు మరియు చిక్కిలను పరిశీలించి వాటిపై ఉన్న గడువును ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పరిశీలించుకోవాలని నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సలీం భాష అన్నారు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి నూరు శాతం G FLN సాధించాలని అన్నారు.