అల్లాపూర్ లో ఇంట్లో చోరీ

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 భూమయ్య పిట్లం పిట్లం మండలంలోని అల్లాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి మార్గం పోశయ్య అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎస్సై వెంకట్రావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు ఎంత మేరకు డబ్బు బంగారం పోయిందనే సమాచారం ఇంకా తెలియ రాలేదని తెలిపారు.