అనకాపల్లి ఉత్సవ్‌కు ప్రజలందరూ సహకరించాలి

★సూపరిండెంట్ సబ్బి అప్పలరాజు

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ వేగి రామారావు అనకాపల్లి జనవరి 29 : అనకాపల్లి జిల్లాలో తొలిసారిగా నిర్వహించనున్న ‘అనకాపల్లి ఉత్సవ్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కె.కోటపాడు ఎంపీడీవో కార్యాలయం నుండి సూపరిండెంట్ సబ్బి అప్పలరాజు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలు ఈ నెల 30, 31 తేదీల్లో అనకాపల్లి జిల్లాలోని ప్రముఖ ప్రాంతాల్లో జరగనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్, అనకాపల్లి వారి మరియు జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, విశాఖపట్నం వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు అనకాపల్లి జిల్లాతో పాటు సమీప జిల్లాల ప్రజలు కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం అనకాపల్లిలో సాంస్కృతిక కార్యక్రమాలు, క్రాకర్ షో, లోకల్ టాలెంట్ ప్రదర్శనలు, కొండకర్ల ఆవ లేక్ వద్ద పిల్లల వినోద కార్యక్రమాలు, వాతావరణ అలంకరణలు, ఫోటో బూత్‌లు, తేలియాడే షాపింగ్ మార్కెట్, ముత్యాలమ్మ పాలెం బీచ్ వద్ద వాటర్ స్పోర్ట్స్, ఫ్లీ మార్కెట్, ఫుడ్ స్టాల్స్, లైవ్ బ్యాండ్, బెల్లం మార్కెట్ యార్డ్, అనకాపల్లిలో ఫ్లవర్ షో నిర్వహించనున్నట్లు తెలిపారు. కే.కోటపాడు మండలంలోని ప్రజాప్రతినిధులు, 32 గ్రామ పంచాయతీల ప్రజలు, మండలంలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.