108 రథసాధకులకు చిరు సత్కారం

సత్తుపల్లి జనవరి 28 సాక్షి డిజిటల్ (రిపోర్టర్) చెన్నకేశవులు, ఖమ్మం జిల్లా108 అంబులెన్స్ సర్వీస్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లాస్థాయిలో అత్యుత్తమ సేవలు అందించిన సత్తుపల్లి 108 EMT ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గొల్లమందల కృష్ణ కు, వేంసూర్ 108 అంబులెన్స్ వాహన చోదకుడు డ్రైవర్ షేక్. అన్వర్ కు, వేంసూర్ 108 అంబులెన్స్ వాహన చోదకుడు డ్రైవర్ కొండ్రు రవి తల్లాడ 108 అంబులెన్స్ EMT ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నల్లగట్ల. రామారావు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి IAS 108 సర్వీస్ జిల్లా మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ నజీరుద్దిన్ ఉత్తమ సేవా ప్రశంసా పత్రం అవార్డులు అందజేశారు.