సీసీ కెమెరాలకు చేయూత గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కీలకం

★మాజీ సర్పంచ్ తిరుపతి గౌడ్

సాక్షి, డిజిటల్ న్యూస్, జనవరి 28, శంకరపట్నం, రాజు సీనియర్ జర్నలిస్టు. !!! గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కీలకంగా వ్యవహరించాలని మండలంలోని కాచాపూర్ మాజీ సర్పంచ్,, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి గౌడ్ పిలుపునిచ్చారు, మంగళవారం ఆయన కాంగ్రెస్ నాయకుడు ఊకంటి మధుకర్ తో కలిసి సీసీ కెమెరాలను గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రారంభించారు,, 30 వేల రూపాయల విలువ చేసే సీసీ కెమెరాలు కొనుగోలు చేసి గ్రామపంచాయతీ కార్యాలయంలో బిగించడం జరిగిందన్నారు, ఈ కెమెరాలతో దొంగల నివారణ ఉండే అవకాశం ఉందన్నారు, గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్క రూ ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలన్నారు, గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చేయుటకు సర్పంచ్ కి సంపూర్ణ సహకారం అందించాలన్నారు, అట్టడుగు వర్గాలను ఆదుకోవడంలో ప్రతి ఒక్కరు నడుం బిగించాలన్నారు . మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆశీస్సులతో పెద్ద ఎత్తున నిధులు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు ముందుండాలన్నారు, ఇందుకు కనీస వసతులు గ్రామములో కల్పించి పేదలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని పాలకవర్గాన్ని కి సూచించారు.