సిద్ధాపూర్ ప్రాథమిక పాఠశాలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ మరియు వాటర్ క్యాన్లు అందించిన యువ అడ్వకేట్ కుంభం కిషోర్

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) అచ్చంపేట మండలంలోని సిద్దాపూర్ ప్రాథమిక పాఠశాలకు అదే గ్రామానికి చెందిన యువ అడ్వకేట్ కుంభం కిషోర్ ఉచితంగా గ్యాస్ సిలిండర్ మరియు వాటర్ క్యాన్లు అందించారు అదే విధంగా ప్రతి రోజూ పాఠశాల విద్యార్థులుకు రెండు క్యాన్ల పిల్టర్ వాటర్ సరఫరా చేస్తానన్నారు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీకాంత్ కు గ్రామ సర్పంచ్ సభావట్ రాఘవులు సమక్షంలో గ్యాస్ సిలిండర్ మరియు వాటర్ క్యాన్లు అప్పగించారు మంచి హృదయంతో ముందుకు వచ్చి పాఠశాలకు సహాయం అందించిన కిషోర్ ను గ్రామ సర్పంచ్ సభావట్ రాఘవులుతోపాటు పలువురు గ్రామస్తులు అభినందించారు.