సాక్షి. డిజిటల్ న్యూస్, జనవరి 28, శంకరపట్నం,, కరీంనగర్ జిల్లా, సీనియర్ జర్నలిస్ట్, రాజు, విధి నిర్వహణలో సక్రమంగా పనిచేయాలని,, స్థానిక ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శులను కోరారు,, మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు,, నాలుగు రోజులపాటు ఎంతో వైభవంగా జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు కనీస వసతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు,, కేశవపట్నం సమ్మక్క సారలమ్మ జాతరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఓ ప్రత్యేకత ఉందన్నారు,, లక్షలాదిమంది తరలివచ్చే జాతర భక్తులకు సాగునీటి సౌకర్యముతో పాటు రాకపోకలకు అంతరాయం కలుగకుండా శ్రద్ధ వహించాలన్నారు,, చెత్త చెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు తీసుకొని భక్తులకు సౌకర్యం ఏర్పాటు చేయాలని కార్యదర్శులను ఆదేశించారు,, విధి నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన చర్యలు తప్పని, కృష్ణ ప్రసాద్ హెచ్చరించారు,, జాతర విషయంలో కనీస వసతుల ఉండే విధంగా సమ్మక్క సారలమ్మ జాతర చైర్మన్ గుర్రం స్వామి గౌడ్ శ్రద్ధ తీసుకోవాలని ఎంపీడీవో సూచించారు, ఇందుకు చైర్మన్ గుర్రం స్వామి గౌడ్ స్పందించారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సురేఖ, సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ గుర్రం స్వామి గౌడ్, కేశవపట్నం పంచాయతీ కార్యదర్శి, నరసయ్య, పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.