సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 28 కోట మండల రిపోర్టర్ వెంకట కృష్ణయ్య: నెల్లూరు జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అజిత వేజెండ్ల మంగళవారం ఆకస్మికంగా కోట పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సాధారణ విధుల్లో భాగంగా కోట పోలీస్ స్టేషన్లో తనిఖీ చేశామన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళ రక్షణ తమ ప్రధమ కర్తవ్యం అన్నారు. కోట పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఉన్నదని విలేకరులు అడిగిన ప్రశ్నలకు ట్రాఫిక్ సమస్యను నియంత్రిస్తామన్నారు. హెల్మెట్ లేకపోవడం, త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ లో డ్రైవింగ్, ఇతర రాంగ్ రూట్లో డ్రైవింగ్, ఇతర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులపై కేసులో నమోదు చేయడం జరుగుతుందన్నారు. పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. రౌడీయిజం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.మండలంలో అసాంఘిక చర్యలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట ఎస్సై, పోలీసులు పాల్గొన్నారు.