వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం నియోజకవర్గ సంస్థాగత నిర్మాణ సమావేశం

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు
పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ సారధ్యంలో నేడు వాసర్ల గార్డెన్స్ నందు అమలాపురం నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణ (వర్క్ షాప్) సమావేశం నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి అన్యాయాన్ని. ప్రజలకు అర్థమయ్యే విధంగా. ప్రతి కార్యకర్త నాయకులు.. కలిసికట్టుగా పని చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీలు బొమ్మి ఇశ్రాయేల్ ,కుడుపూడి సూర్యనారాయణ రావు , ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ,రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు జిన్నూరి బాబీ ,రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు ,వంటెద్దు వెంకన్నాయుడు ,కటకంశెట్టి ఆదిత్య ,అమలాపురం పరిశీలకులు కర్రి పాపరాయుడు ,మాజీ ఎంపీ చింతా అనురాధ ,S.E.C మెంబెర్స్ కుడుపూడి బాబు ,భరత్ భూషణ్ మరియు మండల పార్టీఅధ్యక్షులు, ఎంపీపీ లు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులతో పాటు ప్రజా ప్రతినిధులు, మరియు తదితరులు పాల్గొన్నారూ.