సాక్షి డిజిటల్ న్యూస్- జనవరి 28 – సనత్ నగర్ – యోగా చేయడం వలనఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సనత్ నగర్ లోని బికె గూడ పార్క్ లో యోగా సాధకుల కోసం 39 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన షెడ్డును ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్క్ కు వచ్చే వాకర్స్, యోగా సాధకులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్క్ లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పచ్చదనం పెంచేలా మొక్కలను నాటాలని అధికారులను ఆదేశించారు. పార్క్ లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తానని ప్రకటించారు. షెడ్డును యోగా సాధకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అమీర్ పేట సర్కిల్ DC సుజాత, GHMC DE మహేష్, ఎలెక్ట్రికల్ DE కృష్ణారావు, హార్టికల్చర్ అధికారి సైదులు గౌడ్, శానిటేషన్ DE వెంకటేష్, వాటర్ వర్క్స్ మేనేజర్ సింధూజ, డివిజన్ పార్టీ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, సీనియర్ సిటీజన్స్ సభ్యులు పార్థసారధి, దూబే, సాయి, ఆనంతరెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, అశోక్ యాదవ్, కూతురు నర్సింహ, గోపిలాల్ చౌహన్, గుడిగే శ్రీనివాస్ యాదవ్, ఖలీల్, బాలరాజ్, హరిసింగ్ తదితరులు ఉన్నారు. సనత్ నగర్ లోని 60 ఫీట్ రోడ్డులో గల సాయిబాబా నగర్ లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా కాలనీలో డ్రైనేజీ, రోడ్ల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే డ్రైనేజీ పైప్ లైన్, రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా విద్యుత్ స్తంభాలపై చిందరవందరగా ఉన్న కేబుల్ వైర్లతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని స్థానిక మహిళలు పలువురు తెలపగ, 24 గంటలలో విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను తొలగించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా కాలనీలోని అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ, DC సుజాత, GHMC DE మహేష్, ఎలెక్ట్రికల్ DE కృష్ణారావు, హార్టికల్చర్ అధికారి సైదులు గౌడ్, శానిటేషన్ DE వెంకటేష్, వాటర్ వర్క్స్ మేనేజర్ సింధూజ, సనత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, కాలనీ వాసులు కొత్తపల్లి రమేష్ గౌడ్, కొత్తపల్లి అర్జున్ గౌడ్, నాయకులు సురేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, శేఖర్ , గోపిలాల్ చౌహాన్, అశోక్ యాదవ్, నారాయణ రాజు తదితరులు ఉన్నారు.