వర్ధన్నపేట లో వేడెక్కిన రాజకీయం

వర్ధన్నపేట . సాక్షి డిజిటల్ న్యూస్ . రిపోర్టర్ . కుందూరు మహేందర్ రెడ్డి . జనవరి. 28. మున్సిపాలిటీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వర్ధన్నపేట పట్టణంలో మున్సిపల్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ప్రధాన కూడళ్లు, విద్యుత్ స్తంభాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. మోగిన నగారా.. వర్ధన్నపేటలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో వర్ధన్నపేట పట్టణంలో రాజకీయ వేడి మొదలైంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా, తాజా తుది ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 10,526 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 5,109, మహిళలు 5,416, ఇతరులు 1 మంది ఉన్నారు. అధిక ఓటర్లు 5వ వార్డులో 1,048 మందిగా నమోదు కాగా, అతి తక్కువ ఓటర్లు 11వ వార్డులో 666 మందిగా ఉన్నారు. మహిళా ఓటర్లు పురుషుల కంటే అధికంగా ఉండటం గమనార్హం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వార్డు వారీగా సమీకరణలు మారుతుండటంతో వర్ధన్నపేటలో రాజకీయ కోలాహలం తారస్థాయికి చేరుతోంది.