రేషన్ డీలర్ల నూతన కమిటీ ఎన్నిక

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 28, మల్లాపూర్ మండలం రిపోర్టర్ ఆకుతోట నర్సయ్య: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామంలో మంగళవారం మల్లాపూర్ మండల రేషన్ డీలర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మల్లాపూర్ మండలం రేషన్ డీలర్ల సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ముద్దం ప్రకాష్, అధ్యక్షులుగా దప్పుల నర్సయ్య, ఉపాధ్యక్షులుగా ఇస్లావత్ విజయ, కోశాధికారిగా కల్లేడ లలిత, ప్రధాన కార్యదర్శిగా గుండు మహిపాల్, కార్యదర్శిగా వెంకట్ లను డీలర్ల అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.డీలర్స్ అధ్యక్షులు దప్పుల నర్స య్య మాట్లాడుతూ డీలర్ల సమస్యలకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఈ అవకాశం కల్పించిన రేషన్ డీలర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.