రీ సర్వేలోని ఇబ్బందులు తొలగిస్తే నే విధులు

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 పెనగలూరు రిపోర్టర్ మధు, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం మండలంలో తాసిల్దార్ వారి కార్యాలయంలో రీ సర్వేలోని ఇబ్బందులను తొలగిస్తేనే విధులు చేపట్టగలమని మండల సర్వేయర్ల బృందం మంగళవారం తాసిల్దారు అమరేశ్వరి కి. కేజీ సర్వేయర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బి మధుబాబు ప్రధాన కార్యదర్శి ఎం మహేష్ నాయుడు పిలుపుమేరకు దావై కార్యక్రమము చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు గ్రామాలలో జరిగిన రీ సర్వేపై రైతులతో ఐ.వి.ఆర్.ఎస్ కాల్స్ నిర్వహించి వారి అభిప్రాయం మేరకే ముందుకు సాగాలని కోరారు అలాగే రీ సర్వేపై ఒత్తిడి చేయకుండా తగిన వ్యవధి ఇచ్చి ఎస్ఓపి ప్రకారం నిర్దిష్ట కాలపర్మితిని విధించాలన్నారు రీ సర్వే గ్రామాల్లో వీఆర్వో ఆర్ఎస్డిటి సహా సంబంధిత రెవెన్యూ సిబ్బంది తప్పనిసరిగా హాజరై అడంగల్ ఆర్ ఓ ఆర్ సంబంధిత రికార్డులను పరిష్కరించాలి. రీసర్వే జరుగుతున్న గ్రామాలలో వచ్చే ఎఫ్ లైను. పట్టా సబ్ డివిజన్ వంటి ల్యాండ్ సర్వీస్ లను తాత్కాలికంగా మండల సర్వేయర్లకు అప్పగించాలి గ్రామ సర్వేయర్ లేని గ్రామాలలో రీ సర్వే చేసేందుకు అదనంగా 15 రోజులు సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.