మార్కెట్ యార్డ్ కాంపౌండ్ కూల్చివేతపై….జెడ్పి మాజీ చైర్ పర్సన్, గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సరితా తిరుపతయ్య ఆగ్రహం…

★అక్రమ నిర్మాణాలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 2026 రిపోర్టర్ రాజు, జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ కాంపౌండ్ వాల్ను అక్రమంగా కూల్చివేయడంపై మాజీ జడ్పీ ఛైర్పర్సన్ సరితా తిరుపతయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె కూల్చివేత జరిగిన ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించి, మార్కెట్. సెక్రటరీ తో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ, సొంత లాభం కోసం అక్రమ నిర్మాణాలకు తెరలేపడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సరితా తిరుపతయ్య మాట్లాడుతూ, మార్కెట్ యార్డ్ కాంపౌండ్ గోడను కూల్చివేసి, అక్కడ కొత్తగా షాపుల నిర్మాణానికి ప్రయత్నిస్తున్న వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా గోడ కూల్చివేస్తున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అధికారులదే అధికారుల ది అని చెప్పడం జరిగింది.