మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రమే ప్రభుత్వమే వాహించాలి.

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 28, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వమే నడపాలని రోలుగుంటలో పోస్టల్ ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం సిపిఎం నాయకులు చిరంజీవి మాట్లాడుతూ 2004లో వామపక్ష పార్టీలు ప్రజాసంఘాలు పోరాట ఫలితంగా ఉపాధి హామీ పథకం వచ్చిందని చట్టానికి చట్టబద్ధత కల్పిస్తూ వంద రోజులు పని దినాలు గ్యారెంటీ కల్పించారని అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని కరోనా టైంలో కూడా ఈ పథకం పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేరు మార్చి రాష్ట్రాల పైన నలభై శాతం భారం పెట్టడం సరైన విధానం కాదని అన్నారు. రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నాయని అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు పథకాన్ని నడపడం కష్టమవుతుందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం దీనిపై ఆలోచించాలి పని ప్రదేశాల్లో టెంట్ మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గాజులు పాల్గొన్నారు.