మధు ప్రైమరి లీగ్ విజేత సులేమాన్ నగర్

సాక్షి డిజిటల్ న్యూస్ 28 జనవరి 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయని, ప్రతి ఒక్కరూ తప్పక శారీర శ్రమకు సమయం కేటాయించి వారి ఆరోగ్యాలను కాపాడుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఆ సూక్తిని ఎప్పుడు మరవద్దని ఎస్సై సాయన్న అన్నారు. ఆదివారం, సోమవారం రెండు రోజులపాటు రాణంపల్లిలో జరిగిన మధు ప్రైమర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఎస్సై సాయన్న హాజరై విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. విన్నర్ టీం గా సులేమాన్ నగర్, రన్నర్ టీం రాణంపల్లి గెలుపొందగా మాన్ అఫ్ ది మ్యాచ్ సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన షేక్ కాజా ఎంపికైనట్లు గాండ్ల మధు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ క్రికెట్ గేమ్ ఒక టీం వర్క్ గేమ్ అని, ఒక్కరు రాణిస్తే గేమ్ గెలువలేరని టీం సభ్యులందరూ కలిసికట్టుగా రాణిస్తేనే వారి టీం గెలుపొందుతుందన్నారు. అదేవిధంగా నిజజీవితంలో కూడా అందరు కలిసి మెలిసి ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని అన్నారు. విన్నర్ టీం పదివేల నగదు తో పాటు ట్రోఫీ, రన్నర్ టీంకు ఐదు వేల రూపాయల నగదు ట్రోఫీని, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన షేక్ ఖాజా ను ఎంపిక చేసి 1111 నగదును అందజేసినట్లు గాండ్ల మధు తెలియజేశారు. ఈ టోర్నమెంట్లో విన్నర్ టీంకు 10 వేలు రూపాయలను కొత్తపల్లి రవికిరణ్, రన్నర్ టీం కోసం 5 వేల రూపాయలు బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కోసం 1111 రూపాయలు మారుతి గౌడ్ లు వారి సహాయ సహకారాలు అందజేసినందుకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రుద్రూర్ ఎస్సై సాయన్న, రాణంపల్లి సర్పంచ్ కొండల్ వాడి శంకర్, చిక్కడపల్లి సర్పంచ్ మచ్కూరి రమేష్, మాజీ కోఆ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *