మద్యం విముక్త గ్రామం దిశగా కొందుర్గు

★అక్రమంగా పట్టుబడ్డ మద్యం బాటిళ్లు ధ్వంసం

సాక్షి డిజిటల్ న్యూస్ చింతకింది సిద్దు రిపోర్టర్ కొందుర్గ్ మండలం రంగారెడ్డి జిల్లా 28-1-2026, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు సర్పంచ్ చౌడపురం ప్రభాకర్ ఘాటు హెచ్చరిక గ్రామ పంచాయతీ గ్రామసభలో ఈ నెల 21 వ తేదీన తీసుకున్న 'బెల్టుషాపుల నిషేధ' తీర్మానాన్ని ధిక్కరించి అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై సర్పంచ్ ప్రభాకర్ ఉక్కుపాదం మోపారు. గ్రామ యువజన సంఘాలైన ఛత్రపతి శివాజీ సభ్యులు, భగత్ సింగ్ యూత్ సభ్యులు, మరియు గ్రామ పౌరులతో కలిసి సర్పంచ్ ప్రభాకర్ గ్రామవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో రెండు చోట్లాల్లో తంగెలపల్లి రాజు,ఈరపురం వనిత అనే ఇద్దరివద్ద సుమారు 50 లీటర్ల మద్యం లభించింది. పట్టుబడ్డ అక్రమ మద్యం బాటిళ్లను గ్రామ కూడలిలో అందరూ చూస్తుండగానే బహిరంగంగా ధ్వంసం చేసి, నిబంధనలు అతిక్రమిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే అక్రమ మద్యం విక్రయాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం మరియు ఎక్సైజ్ శాఖ బెల్ట్ షాపులకు ఎటువంటి చట్టబద్ధత లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులే స్వయంగా రంగంలోకి దిగి మద్యం రహిత గ్రామం కోసం పోరాడటం ఆదర్శనీయంగా నిలిచింది. గ్రామంలో మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. గ్రామసభ తీర్మానాన్ని లెక్కచేయకుండా మద్యం అమ్ముతున్న వారిపై సర్పంచ్ మరియు యువత తీసుకున్న ఈ చర్య అద్భుతం" అని మహిళలు మరియు గ్రామ పౌరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్మూలన కోసం సర్పంచ్ ప్రభాకర్, వార్డు సభ్యులు, ఛత్రపతి శివాజీ యూత్ మరియు భగత్ సింగ్ యూత్ చూపిన తెగువ ఇతర గ్రామాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఇలాంటి సామాజిక బాధ్యతాయుతమైన పనులు సమాజంలో గొప్ప మార్పుకు నాంది పలుకు తాయని గ్రామపజలు మహిళలు కోరుకుంటున్నారు.