మంచితనానికి, మానవత్వం కి నిలువెత్తు నిదర్శనం మయూరి శ్యామ్ యాదవ్…..ప్రగతి సేవ సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్

*ప్రగతి సేవ సంస్థ అధ్వర్యంలో ఘనంగా మయూరి శ్యామ్ యాదవ్ జన్మదిన వేడుకలు, సామాజిక సేవ కార్యక్రమాలు..

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 28 గూడూరు రిపోర్టర్ (చెన్నూరు మస్తాన్) మంచితనం, మానవత్వంతో తను చేసిన సేవలకు, నిర్వహించిన పదవులకు వన్నె తెస్తూ అనేక బిరుదులు పొందిన శ్రీ కృష్ణ సేవా సమితి అధ్యక్షుడు మరియు జీవన్ దాన్ డోనర్(అవయవ దానం డోనర్) డాక్టర్ బండి శ్యామసుందరరావు (మయూరి శ్యామ్ యాదవ్) కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ప్రగతి సేవ సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ తెలిపారు. ఈసందర్భంగా ప్రగతి సేవా సంస్థ సభ్యుడు మాముడూరు రాధయ్య.., మయూరి శ్యామ్ యాదవ్ జన్మదిన సందర్భంగా రచించిన సన్మాన పత్రంను ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ కు బహుకరించడం జరిగింది. ప్రగతి సేవ సంస్థ అధ్వర్యంలో మయూరి శ్యామ్ యాదవ్ జన్మదినం సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు పది కుర్చీలను గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ షరీన కి అందించడం జరిగింది. పట్టణంలోని ఓం సాయిరాం వృద్ధాశ్రమ నందు సుమారు 45 మంది వృద్ధులకు అన్నదాన వితరణ కార్యక్రమం, ఆ తదుపరి శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాల ప్రధానాచార్యులు రంగనాయకులు ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థుల తో కలిసి మయూరి శ్యామ్ యాదవ్ బర్త్డే కేక్ ను కట్టింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మినీ గురుకులం హెడ్ మాస్టర్ కె వి రజిని కుమారి ఆధ్వర్యంలో (ఏ.పి.టి.డబ్ల్యూ.ఆర్) విద్యార్థులు ఉపాధ్యా యునులు కలిసి బర్త్డే కేక్ ను కట్టింగు చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ బండి శ్యామ్ యాదవ్ గారి జన్మదిన పురస్కరించుకొని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో 10 కుర్చీలను బహుకరించడం జరిగింది అని అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఆర్.ఎం.ఓ డాక్టర్ ప్రసన్న, హెడ్నర్స్ మౌలా, మయూరి శ్యామ్ యాదవ్ అల్లుడు,వనజా కృష్ణ కళ్యాణ మండపం ఇంచార్జ్ ఆనంద్, ప్రగతి సేవ సంస్థ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, విఎంసి మెంబర్ వెంకటేశ్వర్లు, వాచ్ షాప్ రాము, పచ్చ శ్యామ్, కోట వెంకటేశ్వర్లు, డిష్ నాగరాజు, కృష్ణారెడ్డి, విజయ్ వెంకట్రావ్, నాగేంద్ర, హాస్పిటల్స్ సిబ్బంది, వృద్ధాశ్రయం కేర్ టేకర్ కళ్యాణి, శిశుమందిర్ ఆచార్యులు రంగనాయకులు, మినీ గురుకులం హెడ్మాస్టర్ రజిని కుమారి మరియు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *