బ్రిడ్జి నిర్మాణపనులు ప్రారంభించిన , మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 28: రిపోర్టర్ తిరుపతి సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని ధమ్మక్కపల్లి గ్రామపంచాయతీ రెవెన్యూ పరిధిలోని మోద్దుల పంపు, చెక్ డాం పరిధిలోని బ్రిడ్జి నిర్మాణ పనులకు గజ్వేల్ నియోజకవర్గం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి సహకారం తొ 30 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మంజూరైన నిధులకు గజ్వేల్ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే తూ ముకుంట నర్సారెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించడం జరిగింది. నర్సారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, రైతుల కోసం ఎన్ని నిధులైన కేటాయించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని కొనియాడడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సంక్షేమ ప్రభుత్వం పేదలకు నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందించడంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధిస్తుంది మాట్లాడడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాసరి లింగారావు , ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి , గ్రామ సర్పంచ్ లాగిశెట్టి జ్యోతి, ఉప్ప సర్పంచ్ భారత్,కొండపాక మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ గజ్వేల్ సుదర్శన్ , మాజీ ఎంపీపీ అనసూయ కనక రాములు ,బైరి ప్రణీత్ రెడ్డి ,మాజీ సర్పంచ్ నీలా మల్లేశం,మాజీ ఎంపీటీసీ లు, కనకయ్య, యాదయ్య,కొండపాక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ యాదవ్ , ఏఎంసీ డైరెక్టర్స్ చుక్క యాదయ్య, ఆరిఫ్, రాజు, ఉప్ప సర్పంచ్ లు కర్ణాకర్, సుధాకర్, అడ్వాకెట్ రాజు, నర్సింలు,పంభాల సురేందర్, వార్డ్ మెంబర్స్,అఖిల్, రాజు, నర్సింలు, వికాస్ రెడ్డి, మల్లేశం, కిష్టయ్య,ప్రవీణ్ కుమార్, మల్లేశం, తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *