బీరప్పగడ్డ రామాలయం సమీపంలో సీసీ కెమెరాలు, వీధి దీపాల ఏర్పాటు చేయాలి ఉప్పల్ కాంగ్రెస్ నాయకుడు ఇర్షాద్ ఖాన్ (ఉప్పల్ ఖాన్) కు స్థానికులు వినతి….

★ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి కి వెంటనే తెలియజేసి త్వరలోనే సీసీ కెమెరాలు,వీధి దీపాల ఏర్పాటు చేపిస్తాం ఇర్షాద్ ఖాన్

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28/2026, మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్ ఉప్పల్ బీరప్పగడ్డ ప్రాంతంలో రామాలయం సమీపంలో స్థానిక ప్రజలు తమ సమస్యలను ఉప్పల్ కాంగ్రెస్ నాయకుడు ఇర్షాద్ ఖాన్ (ఉప్పల్ ఖాన్) దృష్టికి తీసుకువచ్చారు.ఆ ప్రాంతంలో సరైన వీధి దీపాలు లేకపోవడం వల్ల చీకటి పడిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి మద్యం సేవించడం వల్ల అసహనకర పరిస్థితులు ఏర్పడుతు న్నాయని స్థానికులు వాపోయారు. ఈ కారణంగా అక్కడ సీసీ కెమెరాలు మరియు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని వారు కోరారు.ఈ సందర్భంగా ఇర్షాద్ ఖాన్ మాట్లాడుతూ, స్థానికుల సమస్యను తాను ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి కి వెంటనే తెలియజేస్తానని, చాలా త్వరలోనే సీసీ కెమెరాలు మరియు వీధి దీపాల ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ప్రజా ప్రభుత్వంలో భాగంగా పరమేశ్వర్ అన్న సహకారంతో ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని, ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలబడి సేవ చేస్తామని ఇర్షాద్ ఖాన్ తెలిపారు. భవిష్యత్తులో కూడా పరమేశ్వర్ అన్న నాయకత్వంలో ప్రజలకు నిరంతరం సహాయ సహకారం అందిస్తానని ఆయన స్పష్టం చేశారు.