బి ఆర్ ఎస్ లో చేరికలతో కుదిపిన చిట్యాల రాజకీయం

★కాంగ్రెస్ కు గట్టి దెబ్బ

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 నల్గొండ జిల్లా చిట్యాల మండలం, చిట్యాల మున్సిపాలిటీ 2వ వార్డుకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ షబానా అజీముద్దీన్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన యాభై కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణ కేంద్రంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ధి, సంక్షేమం కుంటునపడ్డాయి. డైవర్షన్ పాలిటిక్స్ తో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాజకీయ పబ్బం గడుపుతున్నాడు. అతి తక్కువ సమయంలో ఇంత వ్యతిరేక మూట కట్టుకున్నారు. మార్పు అంటూ నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచినది. కాంగ్రెస్ పార్టీ మోసాలకు బలైపోయామని ఇప్పుడు ప్రజలందరూ బాధపడుతున్నారు. ప్రభుత్వం కొత్త పథకాలను ఇవ్వకపోవడమే గాక ఉన్న పథకాలను రద్దు చేసి పేదోల్ల పొట్టకొడుతుంది. ముందు చూపుతో బి ఆర్ ఎస్ ప్రభుత్వలో కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. బాలింతలకు ఆసరా ఇచ్చిన కెసిఆర్ కిట్ పథకాన్ని పూర్తిగా ఆపేసిన ప్రభుత్వం సన్నబియ్యం అనే పథకం గతంలో కేసీఆర్ తెచ్చినదే దేశంలో గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెట్టిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ చదువుకున్న విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చాకా దాని ఊసేలేకుండా చేశారు. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన బతుకమ్మ పండుగకి కెసిఆర్ గారు అందించిన బతుకమ్మ చీరలను పేరుమార్చి ఇందిరమ్మ చీరలంటూ ఎన్నికల సమయంలో పంపిణీ చేస్తున్నారు.. ఆడబిడ్డల, రైతన్నల శాపనార్థాలు ఈ రాష్ట్రానికి మంచిది కాదు… రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ప్రజలకు భద్రత లేదు రక్షణ లేదు.. ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ నాయకులు మీ ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.. వారికి ఎన్నికలలో ఓట్లు సీట్లు తప్పా మన పేదప్రజల కష్టాలు బాధలు పట్టవు.. బిఆర్ఎస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని ఈ పట్టణ ప్రజలను కోరుతున్నాం ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చేపూరి రవీందర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య పొన్నం లక్ష్మయ్య అంతటి వెంకటేశం మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.