ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ ఆకస్మిక తనిఖీ

సాక్షి డిజిటల్ న్యూస్ 28 జనవరి 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా. రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి మంగళవారం జరిగే ప్రత్యేక ఆరోగ్య మహిళా క్లినిక్ ను నిజామాబాద్ జిల్లా ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో మహిళలు పొందే సేవలను, రికార్డులను, వారికి నిర్వహించే పరీక్షల రిజిస్టర్లను, రికార్డులను తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ఆయేషా సిద్దిఖ వారి సేవలు, వివరాలు అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తి పరిచారు. ఆకస్మిక తనిఖీ సమయంలో ప్రత్యేక వైద్య విస్తీర్ణ అధికారి శ్రీనివాస్, ఆరోగ్య పర్యవేక్షకురాలు సుమతి, ల్యాబ్ టెక్నీషియన్ సురేష్, నర్సింగ్ ఆఫీసర్ వరలక్ష్మి, శిరీష ఆశలు ఉన్నారు.