సాక్షి డిజిటల్ న్యూస్ - జనవరి 28 - సికింద్రాబాద్ - సికింద్రాబాద్ తుకారం గేటు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలను లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చేర్చడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంటూ అడ్డగుట్ట అఖిల పక్షం నేతలు మంగళవారం సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ ప్రతిపాదనలను రద్దు చేసేలా కృషి చేయాలని వారి విజ్ఞప్తి చేశారు. అఖిల పక్ష నేతలు ఎస్.యాదగిరి, నక్క మధు, ఆర్.మల్లేష్, నర్సింగ్ రావు, మనోహర్, హంసరాజు, చందర్, శ్రీధర్ గౌడ్, శ్రీరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ అంశం పై ఉన్నతాధికారులతో సంప్రదిస్తామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.