సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్, మోత్కూర్ మున్సిపాలిటీలో సిపిఎం పార్టీ పోటీచేస్తుందని, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించగల పోరాట పటిమ కలిగిన కమ్యూనిస్టులనే గెలిపించాలని, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి ఎండీ జాహంగీర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం రోజున మోత్కూర్ మున్సిపాల్టీ పరిధిలోని ముఖ్య కార్యకర్తల సమావేశం సీఐటీయూ జిల్లా నాయకులు కూరేళ్ళ నర్సింహా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై ఆయన మాట్లాడుతూ…..రాజకీయం వ్యాపారంగా మారిందని అలాటి డబ్బు రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలని కోరారు. ప్రజా సమస్యలు పట్టని నాయకులు ప్రజలను ప్రలోబాలకు గురించేసి ఎన్నికల్లో గెలవాలనే వారి ఎత్తులను ప్రజలు తిప్పికొట్టాలని అన్నారు. పదవులు ఆభరణం కాదని అది పోరాటానికి ఆయుధంగా ఉంటుందని, అలాంటి పోరాట పటిమ కలిగిన కమ్యూనిస్టులనే ప్రజలు గెలిపించాలని కోరారు. మోత్కూర్ మున్సిపాల్టిలో నెలకొన్న సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్వహించిన ఘనత సిపిఎం పార్టీకి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతికూమార్, రైతు సంఘం జిల్లా నాయకులు పైళ్ల యాదిరెడ్డి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సురేందర్ పట్టణ కార్యదర్శి రాచకొండ రాములమ్మ, కూరపాటి రాములు, మండల కమిటీ సభ్యులు కురిమేటి యాదయ్య, మెతుకు అంజయ్య, కందుకూరి నర్సింహా తదితరులు పాల్గొన్నారు.