సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 28 బలిజిపేట మండల రిపోర్టర్ సిహెచ్ మురళి, పెదపెంకి లో ఫైలేరియా పారిశుధ్యము మరియు పరిశుభ్రత గురించి అవగాహన సదస్సును మంగళవారం బలిజిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కిరణ్ మై సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాధ ఫిబ్రవరి 10వ తేదీ న సామూహికంగా డి. ఇ. సి. మాత్రలు మింగించే కార్యక్రమం ఉంది కావున ప్రతి ఒక్కరూ మాత్రలు మింగాలి అని ప్రతి ఒక్కరు పరిశుభ్రత ను పాటించాలి అని ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారానికి ఒక సారి డ్రై డే ఫ్రై డే పాటించాలని వైద్య అధికారిని అన్నారు. ఈ సదస్సు లో సర్పంచ్ నగిరి పాపారావు చిలకలపల్లి లెప్రసీ ఫౌండేషన్ డైరెక్టర్ సిబ్బంది పి. సి. ఐ. స్వచ్ఛంద సంస్థ కో ఆర్డినేటర్ స్థానిక వైద్య సిబ్బంది నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
