పాకల వద్దకే పశు వైద్య సేవలు

★రైతులకు ఎంతో మేలు- పశువైద్యాధికారిణి బాల తేజ ★గుమ్మాలపాడు లో ఉచిత పసి వైద్య శిబిరం విజయవంతం

సాక్షి డిజిటల్ న్యూస్ రావికమతం జనవరి 27 : ముమ్మర పనుల్లో పాడి రైతులు ఉండటం, పెద్ద ఎత్తున పశువులు వచ్చేందుకు వీలుగా ఖాళీస్థలాలు లేకపోవడం కారణంగా ఊరు మొత్తం పశువులు ఒకే దగ్గర రావటం , పశు వైద్య శిబిరాలు, సామూహిక టీకాల కార్యక్రమాలు నిర్వహించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న దృశ్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల కలాల వద్దకే వైద్యాధికారులు వచ్చి పసి వైద్యం చేస్తున్నామని దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్త పశు అరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని రైతులు సద్విని యోగించుకోవాలని కొత్తకోట పశు వైద్యాధికారిణి డా.బాలతేజ అన్నారు.తమ పశు వైద్య బృందం దేవుడు , నాయుడు, శ్రీదేవి తో కలిసి గుమ్మాలపాడులో రైతులపాకల వద్దే పశువులకు, కోళ్లకు మంగళవారం వైద్య సేవలు అందించారు . బంటు వారి కల్లాల వద్ద మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ద్వారా 63 కోళ్లకు ,పశువుల కు నట్టల మందు, చూడి మందులు పంపిణీ చేశారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ శిబిరాలు జరుగు తున్నాయని, ఏ ఏ గ్రామాల్లో నిర్వహించేది ముందుగా పత్రికల ద్వారా ప్రచారం చేస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు..శేషు రావికమతం.