సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు
ముమ్మిడివరం నియోజకవర్గం మురమళ్ల: ఉద్యోగ భవిష్య నిధి ద్వారా లబ్ది పొందుతున్న ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కరం కోసం నిధి ఆప్కే నికత్ కార్యక్రమం చేపట్టినట్లు కాకినాడ ఈ పి ఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి జే. రాజేష్ కుమార్ అన్నారు. మంగళవారం మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో పనిచేస్తున్న సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సౌకర్యార్థం నిధి ఆప్కే నికత్ పేరుతో ప్రతి నెల 27 న శిబిరాలు ఏర్పాటు చేసి సమస్యలు సత్వర పరిష్కారం చేయడం అలాగే సందేహాలను నివృత్తి చేయడం జరుగుతుందన్నారు. ఆలయ పర్యవేక్షణ అధికారి కఠారి శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం 2018 నుండి ఆలయంలో ఉద్యోగ భవిష్య నిధి అమలు అవుతోందని అందుకు ఆలయ చైర్మన్ మరియు అసిస్టెంట్ కమీషనర్ కార్యనిర్వాహణాధికారి కి సిబ్బంది తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు నిధి ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందమని గుర్తుచేశారు. తొలుత ఈ పి ఎఫ్ అధికారులకు ప్రత్యేక దర్శనం అందించారు. కార్యక్రమంలో ఈ పి ఎఫ్ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
