నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్ ముందు ఉన్న మద్యం దుకాణం అడ్డను మార్చండి…..

★పేట జిల్లా కేంద్రం లో వివిధ గ్రామాల ప్రజల చర్చలు….

సాక్షి,డిజిటల్ న్యూస్ జనవరి, 28,2026 (రిపోర్టర్ ఇమామ్ ), నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు ఉన్న మద్యం దుకాణం ( శ్రీ తిరుమల వైన్స్ )ను అడ్డను మార్చాలని నారాయణపేట పట్టణ ప్రజలు, జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు ఎక్సైజ్ శాఖ అధికారులను కోరుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ముందున్న మద్యం దుకాణం వల్ల పేట ఆర్టీసీ బస్టాండుకు వచ్చే వివిధ రూట్ల నుండి వచ్చే బస్సులు పక్కనే ఉన్న ట్రాఫిక్ వల్ల ప్రజలకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా నారాయణపేట జిల్లా ఎక్సైజ్ అధికారులు స్పందించి ఆర్టీసీ బస్టాండ్ ముందున్న మద్యం దుకాణం అడ్డను మార్చాలని నారాయణపేట జిల్లాకు వచ్చే వివిధ గ్రామాల ప్రయాణికులు ప్రజలు కోరుతున్నారు.