దళితవాడపై ఇంత నిర్లక్ష్యమా.?

★రామన్నపేట పెద్ద యాప చెట్టు సీసీ రోడ్డు నుంచి జనం పెళ్లి లింక్ రోడ్డు బాధ…. ★ కుర్చీకే పరిమితమైన గ్రామపంచాయతీ సెక్రెటరీ… ★క్షేత్రస్థాయి పరిశీలన కరువు…ఎందుకిలా.? ★. బి.ఎస్.పి రామన్నపేట మండల అధ్యక్షుడు నకిరేకంటి నరేష్

సాక్షి డిజిటల్ న్యూస్, 28 జనవరి 2026, రామన్నపేట మండలం రిపోర్టర్,శ్యామల నాగరాజు వంశరాజ్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ పట్టణ కేంద్రంలోని ఎస్సీ కాలనీ వెళ్లే దారిల్లో మురుగు నీరు నిలువ ఉండడంతో, దుర్వాసన వేగజాల్లుతూ కాలనీ రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది.పైనుంచి వస్తున్న ఈ డ్రైనేజీ మురుగు నీరు గవర్నమెంట్ హాస్పిటల్ పోస్టుమార్టం చేసిన నీరుతో పాటు చికెన్ సెంటర్ల వ్యర్ధానీరుతో అన్ని కలిసి కాల్వలోకి వస్తూ నిలువ ఉండడం జరుగుతుంది. దీనివల్ల రోజు ప్రయాణించే స్కూల్ పిల్లలు,పెద్దలు,బాటసారిలు మరీ ముఖ్యంగా పక్కనే ఉన్నటువంటి షెడ్యూల్ కులముల హాస్టల్ అందరూ రోగాల బారిన పడుతున్నారు.చిన్నపిల్లలకు శ్వాస కోస సమస్యలు ఎదురవుతున్నాయి.ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్ అంటున్న తరుణంలో మా రామన్నపేట మేజర్ గ్రామపంచాయత్ లో కనబడకుండా ఉండడం విశేషం.ఇప్పటికైనా తక్షణం క్షేత్రస్థాయి లో పరిశీలించని సెక్రెటరీ,సిబ్బందిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని రామన్నపేట మండల బి.ఎస్.పి పార్టీ అధ్యక్షుడు నకిరేకంటి నరేష్ కోరారు.