దంతెలబోర పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుక.

*విద్యార్థులకు ఏకరూప దుస్తుల వితరణ.

సాక్షి డిజిటల్ న్యూస్: 28 జనవరి, పాల్వంచ. రిపోర్టర్: కె.జానకిరామ్. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా పాల్వంచ మండలం, దంతెలబోర పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లెంపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన గణతంత్ర దినోత్సవ వేడుక నిర్వహించడం జరిగింది. ఈ వేడుక ప్రాథమికోన్నత పాఠశాల దంతెలబోరనకు.. ఎర్రబోరు గ్రామం నుండి వచ్చే విద్యార్థులు దుస్తులు లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ మిత్ర బృందం నవభారత్ గాంధీనగర్ కు చెందిన 9 మంది మిత్రులతో కలిసి ఈరోజు 25 మంది పిల్లలకు ఏకరూప దుస్తులు ఇవ్వడం జరిగింది. ఈ దుస్తులను ఈరోజు జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో దంతెలబోర గ్రామ పంచాయతీ సర్పంచ్ కొండ్రు ప్రసాద్ మరియు ఉపసర్పంచ్ తట్టుకుల మల్లికార్జున్ రావు చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ కొండ్రు ప్రసాద్ మాట్లాడుతూ, గ్రామం అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్య సౌకర్యాలు బాగుండాలని, ఈ క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. వెంకటేశ్వర్లు కృషి చేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. తదుపరి దుస్తులు అందించిన వారిలో చెరుకూరి శేఖర్ బాబు మాట్లాడుతూ, ఈ విధంగా దుస్తులు అందించడం చాలా ఆనందంగా ఉందని ఇకమీదట కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. పాఠశాలలో జరిగిన ఆటల పోటీలకు ఉప సర్పంచ్ తట్టుకుల మల్లికార్జునరావు బహుమతులు కొనుగోలుకు సహకారం అందించారు.. ఈ సమావేశంలో గ్రామానికి చెందిన వార్డు మెంబర్ సురేష్, గ్రామానికి చెందిన నాగిరెడ్డి, నాగభూషణం, రాంబాబు, సత్యనారాయణ, శ్రీలత రెడ్డి, పూర్వ విద్యార్థి జానకిరామ్, అదేవిధంగా యూనిఫామ్ లు వితరణ చేసిన మిత్ర బృందం సభ్యులు చెరుకూరి శేఖర్ బాబు, మందలపు వెంకటేశ్వర్లు, మేకల రాంబాబు, కొర్ర చీన, లాల్ చంద్, ప్రసాద్, నామా సతీష్, ఎం వెంకటేశ్వర్లు, రవీందర్, పాఠశాల ఉపాధ్యాయులు, యాదగిరి, రామేశ్వరి, ఈరు, భీము, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *